ఎరువుల పంపిణీ ప్రక్రియపై అవగాహన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి (DAO) శ్రీమతి పి.ఎల్. వరలక్ష్మి కర్నూలు నగరంలోని మానా గ్రోమోర్ సెంటర్‌లో మరియు కల్లూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామ RSKలో APAIMS యాప్ ద్వారా యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీని పరిశీలించారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి APAIMS విధానం, ఎరువుల పంపిణీ ప్రక్రియపై అవగాహన కల్పించారు. సంబంధిత RSKలో నమోదైన రైతులు తమ పంట నమోదు ఆధారంగా RSKలు, PACSలు లేదా అధీకృత రిటైలర్ల ద్వారా ఎరువులు పొందవచ్చని వివరించారు. రైతుల పంట మరియు సాగు విస్తీర్ణాన్ని ఆధారంగా తీసుకుని ఎరువుల అవసరాన్ని మూడు దఫాలుగా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ విధానం ద్వారా ఎరువుల సక్రమ, సమతుల్య వినియోగం ప్రోత్సహించబడుతుందని వివరించారు. రైతులు సాగు చేస్తున్న పంటలో ఏవైనా మార్పులు ఉంటే వెంటనే సంబంధిత RSKను సంప్రదించి పంట వివరాలను సవరించుకోవాలని సూచించారు. APAIMS ద్వారా ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరుగుతోందని, రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ADA దస్తగిరి రెడ్డి, టెక్నికల్ ఏఓ కిశోర్, కల్లూరు ఏఓ విష్ణువర్ధన్ రెడ్డి మరియు కల్లూరు మండల వ్యవసాయ అధికారి (MAO) రూఫస్ రోనాల్డ్ పాల్గొన్నారు. రైతులు ఈ విధానంపై సంతృప్తి వ్యక్ చేస్తూ వ్యవసాయ శాఖ చేపట్టిన చర్యలను అభినందించారు. రైతులకు సకాలంలో ఎరువుల సరఫరా మరియు పంపిణీ కోసం వ్యవసాయ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని DAO శ్రీమతి పి.ఎల్. వరలక్ష్మి తెలిపారు.


