రాయలసీమ యూనివర్సిటీ 4స్టార్ రేటింగ్ సాధించడంపట్ల వీ.సి హర్షం వ్యక్తం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణా రాష్ట్రాల్లో ఇ-గవర్నెన్స్ సర్టిఫికేషన్ తోపాటుISO సర్టిఫికేషన్లో రాయలసీమ యూనివర్సిటీ 4స్టార్ రేటింగ్ సాధించడంపట్ల వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు హర్షం వ్యక్తంచేశారు. ISO సర్టిఫికేషన్ సంస్థ అయిన హైమ్ సర్టిఫికేషన్ సంస్థ ప్రతినిధులు ఎ. శివయ్య నేతృత్వంలో వర్సిటీలోని వివిధ విభాగాలను, కార్యాలయాలను, హాస్టళ్లను సందర్శించి మొత్తం 7 సర్టిఫికెట్లను అందించడంపట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఇ గవర్నెన్స్ లో వర్సిటీ చేపడుతున్న చర్యలను సర్టిఫికేషన్ కమిటీ అభినందించి తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా రాయలసీమ యూనివర్సిటీ ఈ గవర్నెన్స్ సర్టిఫికెట్ అందించిందన్నారు. దాంతోపాటు విద్యాసంబంధిత సేవలకుగాను ISO 9001 : 2015 సర్టిఫికెట్, క్యాంపస్లో పచ్చదనాన్ని పెంపొందించడంతోపాటు, పర్యావరణ పరిరక్షణకు జరుగుతున్న కృషికి గుర్తింపుగా ISO 14001 : 2015 సర్టిఫికెట్, ఇంధనవనరుల సమర్ధవినియోగానికి సంబంధించి ISO 50001 : 2018, జెండర్ సెన్సిటైజేషన్ ఆడిట్ కు సంబంధించిన ధృవీకరణను, అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్లో AAA సర్టిఫికేట్ అందించారని తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీకి సహకరించిన హైమ్ సర్టిఫికేషన్ ప్రతినిధి ఎ. శివయ్య బృందానికి ఆచార్య వెంకట బసవరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయకుమార్ నాయుడు, వర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య పి.వి. సుందరానంద్, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య సి.వి. కృష్ణారెడ్డి, IQAC డైరెక్టర్ ఆచార్య ఆర్. భరత్ కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

