పుల్లయ్య కళాశాలలో ప్రధానోపాధ్యాయులకు వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక జి. పుల్లయ్య స్వయంప్రతిపత్తి ఇంజనీరింగ్ కళాశాలలో భారత ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, అఖిల భారత సాంకేతిక విద్య మండలి, మరియు విద్య ఆవిష్కరణ శాఖ సంయుక్తంగా ప్రధానమంత్రి శ్రీ పాఠశాల ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు నిర్వహిస్తున్న రెండవ దశ ” ఆవిష్కరణ, రూపకల్పన మరియు వ్యవస్థాపకత వర్క్‌షాప్ నేడు ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులందరికీ సర్టిఫికెట్ బహుకరించారు. ముఖ్య అతిథి అఖిల భారత సాంకేతిక విద్యామండలి పర్యవేక్షకుడు శ్రీ అసీమ్ కల్టే ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇన్నోవేషన్, డిజైన్, మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (IDE) బూట్‌క్యాంప్ యొక్క లక్ష్యం, ఉపాధ్యాయులు, మరియు ఫ్యాకల్టీ సభ్యులకు డిజైన్ థింకింగ్, సమస్య పరిష్కారం, మరియు వ్యాపార నమూనాలలో నైపుణ్యాలను అందించడం ద్వారా ఆవిష్కరణ సంస్కృతిని పెంపొందించడం. ఇది రోట్ లర్నింగ్ నుండి బయటపడి, వాస్తవ ప్రపంచ సవాళ్లకు ఆచరణాత్మక, ప్రభావవంతమైన పరిష్కారాలను సృష్టించేలా మార్చడం, తద్వారా భవిష్యత్తు-సిద్ధంగా ఉండే ఆవిష్కర్తలు మరియు నాయకులను పెంపొందించడం అని తెలియజేశారు. ఈ ఐడి బూట్ క్యాంపును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారతదేశ మొత్తం ఇలాంటి బూట్ క్యాంపులు ఇప్పటివరకు పదివేలకు పైగా నిర్వహించారని తద్వారా భారతదేశం ఉజ్వల భవిష్యత్తుకు దారులు వేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బూట్ క్యాంప్ కన్వీనర్ డాక్టర్ ఎం. గిరిధర్ కుమార్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

