NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ లోక్ అదాలత్ ద్వారా 8122 కేసులను పరిష్కరించాం..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: జాతీయలోక్ అదాలత్      రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి   ఆధ్వర్యంలో  శనివారం 13-9-2025 న జరిగిన  జాతీయ లోక్ అదాలత్ లో ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలలో 8122 కేసులు పరిష్కారం అయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్టు  భూసేకరణలో నష్టపోయిన 60 మంది రైతుల వారసులకు 83,96,374/- రూపాయల నష్టపరిహారాన్ని జిల్లా జడ్జి వారి చేతుల మీదుగా ఇప్పించడం జరిగినది.  జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, కార్యదర్శి    బి. లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ  మొత్తం రెండు జిల్లాల్లో 20 బెంచీలను ఏర్పాటు చేసి 8122 కేసులను పరిష్కరించామని తెలిపారు. ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కమలాదేవి, ఆరవ అదనపు జిల్లా జడ్జి వాసు,  సిబిఐ కోర్టు జిల్లా జడ్జి శోభా రాణి, కర్నూలు బార్ ప్రసిడెంట్  హరినాథ్ చౌదరి,  శాశ్వత లోక్ అదాలత్  చైర్మన్ వెంకట హరినాథ్, రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి లక్ష్మినరసింహారెడ్డి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మల్లేశ్వరి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సరోజనమ్మ మరియు జూనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, కోర్టుమా నిటరింగ్  సి ఐ. రామానాయుడు, న్యాయ వాదులు తదితరులు పాల్గొన్నారు.

About Author