NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యం.. 

1 min read

రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్‌

కర్నూలు, న్యూస్ నేడు:  రాష్ట్రంలోని యువ‌త‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించేందుకు కృషి చేస్తున్నామ‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజీలో ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాబ్ మేళా కార్యక్రమంలో మంత్రి టి.జి భ‌ర‌త్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రానికి ఇప్పటికే 11 లక్షల కోట్ల పెట్టుబ‌డులు త‌మ ప్రభుత్వంలో వ‌చ్చాయ‌న్నారు. ఓర్వక‌ల్లు పారిశ్రామిక పార్కుకు 10 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌న్నారు. రిల‌య‌న్స్ కంపెనీ 1650 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో ప‌నులు ఇప్పటికే ప్రారంభించిన‌ట్లు చెప్పారు. వీటి ఫ‌లితాలు భ‌విష్యత్తులో స్పష్టంగా క‌నిపిస్తాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. దేశంలోని రాష్ట్రాల మ‌ధ్య పెట్టుబ‌డులు ఆక‌ర్షించేందుకు గ‌ట్టి పోటీ నెల‌కొంద‌న్నారు. సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్‌తో రాష్ట్రానికి అన్ని శాఖ‌ల్లో పెట్టుబ‌డులు తీసుకొస్తున్నామ‌న్నారు. నిరుద్యోగుల కోసం నిర్వహిస్తున్న ఈ జాబ్‌మేళాను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేష‌న్ ఛైర్మన్ ఆకెపోగు ప్రభాక‌ర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author