NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంబేద్కర్ ఆలయ నిర్మాణానికి ప్రతిపాదన…

1 min read

మున్సిపల్ కౌన్సిల్లో రెండవ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మల కుమారి

విజయవాడ, న్యూస్​ నేడు:   మున్సిపల్ కౌన్సిల్లో రెండవ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మల కుమారి ప్రతిపాదన చేయడం హర్షణీయమని అంబేద్కర్ ఆలయ కమిటీ అధ్యక్షులు అంబడిపూడి రవి ప్రకాష్ వెల్లడించారు. 16వ తేదీన జరగనున్న కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదనను ఆమోదించాలని వియంసి కౌన్సిల్ సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు.బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి కౌన్సిల్ లో రెండవ డివిజన్ కార్పొరేటర్ అంబటిపూడి నిర్మల కుమారి ప్రతిపాదించారన్నారు. రాజ్యాంగ నిర్మాణమే కాకుండా, అనేక రచనల ద్వారా ప్రజలలో మార్పు తీసుకువచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు అన్నారు. ఆయనను అనేకమంది దేవుడిగా భావిస్తున్నారన్నారు. అలాంటి మహనీయుడి కి గుడి కట్టాలన్న ప్రతిపాదనలను కౌన్సిల్ సభ్యులు అందరూ ఆమోదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జాన్ రత్నం, గుండె సుందరపాల్, పెద్దిపోయిన శ్రీనివాస్, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

About Author