వేగంగా విస్తరిస్తున్న పశ్చిమ హైదరాబాద్ రియల్ ఎస్టేట్
1 min read

నార్త్-సెంట్రల్ హైదరాబాద్ వైపు మళ్లు తున్న ఇళ్ల కొనుగోలుదారులు
మెరుగైన కనెక్టివిటీ, సరసమైన ధరలు, జీవన నాణ్యతకు ప్రాధాన్యం
హైదరాబాద్, న్యూస్ నేడు: గత నెల రోజులుగా హైదరాబాద్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థలు చెప్పేదాని ప్రకారం, నగరంలో ఫ్లాట్ల విక్రయాలు 10–15% వరకు పెరిగాయి. కొండాపూర్, గచ్చిబౌలి, కోకాపేట్, నార్సింగి లాంటి పశ్చిమ కారిడార్ ప్రాంతాలు మౌలిక వసతుల అభివృద్ధి, ఐటీ ఉద్యోగ స్థిరత్వం, పెట్టుబడిదారుల నమ్మకం వల్ల ఇప్పటికీ ముందంజలో ఉన్నా… ఈ వృద్ధి ప్రస్తుతం నార్త్-సెంట్రల్ హైదరాబాద్, ముఖ్యంగా బాలానగర్ ప్రాంతం వైపు సానుకూలంగా మారుతోంది. ఇక్కడ రఘురామ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాంటి డెవలపర్లు ఎ2ఎ హోంల్యాండ్ లాంటి ప్రాజెక్టులతో కొత్త డిమాండును అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. పశ్చిమ ప్రాంతాల్లో కొనుగోళ్లు పెరగడానికి పలు కారణాలను నిపుణులు చెబుతున్నారు. వాటిలో.. ఔటర్ రింగ్ రోడ్డు వెంట కొత్త దశలు పూర్తికావడం, మెట్రో కనెక్టివిటీ పెరగడం, ఐటీ నిపుణుల రాక స్థిరంగా పెరగడం లాంటివి ఉన్నాయి.హైదరాబాద్ నగర విస్తరణ ఉత్తరదిశగా వెళ్తుండడంతో.. బాలానగర్ ప్రాంతం నగరంలో కీలక రెసిడెన్షియల్ కారిడార్‌గా మారేందుకు సిద్ధమైంది. ఇక్కడ కనెక్టివిటీ, నాణ్యతతో పాటు ఇళ్ల కొనుగోలుదారులకు, పెట్టుబడిదారులకు కూడా డబ్బుకు తగిన విలువ లభిస్తోంది.

