NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యోగాకి డబ్ల్యూహెచ్ఓ ఆలస్యపు గుర్తింపు ప్రపంచ ఆరోగ్య విపత్తుకు కారణం

1 min read

యోగశక్తి సాధన సమితి

గుడివాడ , న్యూస్​ నేడు : అంతర్జాతీయ యోగా డే ఉత్సవాలు 2025 లో భాగంగా పీఎం మోడీ ఫిట్నెస్ మంత్ర అవగాహన సదస్సు ఈ రోజు గుడివాడ ప్రభుత్వ హోమియో హాస్పిటల్ నందు యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ నిర్వహించారు.ప్రపంచవ్యాప్తంగా రోగాలు, రుగ్మతలు,అర్ధంతర చా వులు, క్యాన్సర్లు, సర్జరీలు మరియు అవయవ మార్పిడి బాగా భారీగా పెరిగినవి అని దానికి అతి పెద్ద కారణం భారత సనాతన ఆరోగ్య విధానం యోగాకు ఆలస్యపు డబ్ల్యూ హెచ్ ఓ  గుర్తింపు కారణం అన్నారు. మోడీ ప్రధాని అయ్యే వరకు ఎవరూ పట్టించుకోలేదని దీనితో యోగా అందుబాటులోకి రాక, తెలియక ఆరోగ్య విపత్తు ఏర్పడిందన్నారు.అతి తేలిగ్గా ప్రజలకు  ప్రధాని మోడీ ఫిట్నెస్ మంత్ర వాడుకునే లాగా ఇవ్వటం కరోనా కాలంలో మరణాలు భారీగా తగ్గాయని,ఇకముందు కరోనా లాంటి విపత్తులు ప్రజలను బాధించకుండా మోడీ ఫిట్నెస్ మంత్ర ఆదుకోగలదని, కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాన్ని, మోడీ ఫిట్నెస్ మంత్రాన్ని అలవర్చుకోవాలని కోరుతున్నారు. ఈ సమావేశంలో హాస్పటల్ సూపర్డెంట్ డాక్టర్ జగదీశ్వర్ రావు . ప్రారంభించి,మోడీ హెల్త్ కేర్ స్టిక్స్ అందరికీ అందజేశారు.గుడివాడ ప్రభుత్వ హోమియో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేశారు.

About Author