మహిళలకు,బాలికలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు
1 min read

బాలికలు అన్ని రంగాలలో అవకాశాలు అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో అడుగులు వెయ్యాలి
అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలకు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ శుభాకాంక్షలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడుస్థానిక గవరవరం సెంటెన్స్ మహిళా కళాశాల సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.జ్యోతిప్రజ్వలన చేసి జిల్లా కలెక్టరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ పాఠశాలల్లో వివిధ రకాలు పోటీల్లో గెలుపొందిన 14 మంది బాలికలకు ప్రశంశాపత్రాలు, జ్ఞాపికలతో జిల్లా కలెక్టరు, జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘనంగా సన్మానించారు. విద్యతో పాటు ఆత్మరక్షణలో నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో యం. అచ్యుత అంబరీష్, ఐసిడియస్ ఆర్జేడి బి.సుజాతారాణి, పిడి ఏ.శారద, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డా.పి.జె. అమృతం, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకలక్షమమ్మ, జిల్లా శిశుసంరక్షణ అధికారి డా.సి.హెచ్.సూర్యచక్రవేణి, డిఆర్డీఏ పిడి ఆర్.విజయరాజు, తహశీల్దారు గాయత్రీదేవి, నోడల్ అధికారి ఏలూరు తులసి, కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ మెర్సీ, సిడిపివో లు, కళాశాల అధ్యాపకులు,జిల్లా ఐసిడియస్ ఉద్యోగినులు,అంగన్వాడి సెంటర్ల సిబ్బంది, పట్టణ పాఠశాలలు, కళాశాలలు విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.


