జెడ్పిహెచ్ఎస్ పాఠశాల లో ఘనంగా యోగా దినోత్సవం
1 min read

న్యూస్ నేడు హొళగుంద : 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హొళగుంద మండలం, హెబ్బటం గ్రామం, ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ &టీడీపీ యూనిట్ ఇంచార్జ్ బి. సవారప్ప, బూత్ ఇంచార్జ్ బి. మల్లికార్జున పాల్గొని యోగాసనాలు ఆచరించారు. ఈసందర్భంగా మన శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగాను మన జీవితంలో భాగంగా చేసుకోవాలని వారు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సచివాలయం ఉద్యోగులు, అంగన్వాడీ &ఆశ కార్యకర్తలు,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

