పవన్ పై సెటైర్లు వేసిన వైఎస్ సన్నిహితుడు !
1 min read

పల్లెవెలుగువెబ్ : జనసేన అధినేత పవన్‌పై కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు సెటైర్లు విసిరారు. ఆదివారం ఆయన కడపలో మీడియాతో మాట్లాడారు. పవన్ ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో ఆయనకే అవగాహన లేదని ఎద్దేవాచేశారు. ఏపీకి పాచిపోయిన లడ్లు ఇచ్చారన్న పవన్.. నేడు అదే బీజేపీతో పొత్తులో ఉన్నారని తప్పుబట్టారు. సీపీఐ, సీపీఎం వామపక్షాలతో కూడా కలుస్తారేమో వేచిచూడాలన్నారు. పవన్‌ని విమర్శించేంత స్థాయి, మెచ్యూరిటీ తనకు లేదని కేవీపీ రామచంద్రరావు అన్నారు.

