NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో మాతా,శిశు మరణాలు జీరో శాతం నమోదు అవ్వాలి

1 min read

డెలివరీ సమయంలో తల్లి గాని శిశువు గాని మరణిస్తే ఆ కుటుంబం ఎంత కలత చెందుతారో ఆలోచన చెయ్యాలి

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మాతృ,శిశు మరణాలుపై సంబంధిత కమిటీ సభ్యులు, బాధిత కుటుంబాలు సమక్షంలో వైద్యాధికారులులు, సిబ్బందితో కలసి జిల్లాలో జూలై టు సెప్టెంబరు మూడు నెలలు కాలంలో మాతృమరణాలు 1, శిశు మరణాలు 47 కేసులు వారీగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సుదీర్ఘంగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో మాతృ,శిశు మరణాలు జరగకూడదనే లక్ష్యంతో పనిచెయ్యాలని ఆదేశించినను, ప్రతినెల మరణాలు నమోదు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి మహిళ మూలస్తంభం అని, ఆమె చనిపోతే కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అవుతుందని అన్నారు. పిల్లలకు విద్యకు దూరం కావడం తదితర ఎన్నో సమస్యలు తలెత్తుతాయని అన్నారు. జిల్లాలో మాతృ, శిశు మరణాలు జీరోశాతం ఉండేలాగా కృషిచెయ్యాలని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో కూడా స్వయంగా మాట్లాడి వివరాలను తెలుసుకున్నామని అన్నారు. కొన్ని కేసులలో ప్రైవేటు హాస్పిటల్స్  గర్భిణికి ప్రసూతి సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలలో నిర్లక్ష్యం చేయవద్దని, ప్రతి కేసును చాలెంజీగా తీసుకుని తల్లి,బిడ్డ క్షేమంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.పి.జె. అమృతం, డిసిహెచ్ ఎస్ డా. బి.పాల్ సతీష్ కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.యు.శోభ, ఐసిడిఎస్ పిడి పి.శారద, వైద్య నిపుణులు డా.లావణ్య, డా.సుజాత, డా.కళ్యాణ్, డా.అచ్యుతరామయ్య, డా.సుధాకర్, ప్రభుత్వ, ప్రవేటు వైద్యులు, కమిటీ సభ్యులు, డిపిహెచ్ యన్ వో బి.జ్యోతి, ఏయన్ యంలు, వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు, ఆయా కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

About Author