NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నారా లోకేష్ తో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ సమావేశం

1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల బలోపేతం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ఈరోజు అమరావతిలో విద్య, ఐటీ & ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి  నారా లోకేష్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నాన్-టీచింగ్ సిబ్బంది కొరత కారణంగా ఎదురవుతున్న సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో మొత్తం 369 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉండగా, వాటిలో కేవలం 196 పాఠశాలల్లో మాత్రమే నాన్-టీచింగ్ సిబ్బంది పోస్టులు మంజూరై ఉన్నాయని, 1999 తర్వాత అప్‌గ్రేడ్ అయిన 173 పాఠశాలల్లో జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టులు లేవని వివరించారు.నాన్-టీచింగ్ సిబ్బంది లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు జీత బిల్లులు, రికార్డుల నిర్వహణ, విద్యార్థుల ధృవపత్రాలు, స్కాలర్‌షిప్ పనులు వంటి పరిపాలనా విధులు నిర్వహించాల్సి వస్తోందని, దీని వల్ల బోధనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారని తెలిపారు. ఇది విద్యా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతూ, కొంతమంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు.అదేవిధంగా, విద్యార్థుల సంఖ్య 700 నుంచి 900 వరకు ఉన్న కొన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పరిపాలనా భారం అధికంగా ఉండటంతో సీనియర్ అసిస్టెంట్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల అవసరం ఉందని చైర్‌పర్సన్ గారు వివరించారు.ఈ నేపథ్యంలో,1999 తర్వాత అప్‌గ్రేడ్ అయిన 173 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు 173 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు,విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలకు 12 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు మరియు 4 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు,మొత్తం 189 నాన్-టీచింగ్ పోస్టుల మంజూరుకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రి కి సమర్పించారు.ఈ పోస్టుల మంజూరుకు సంబంధించి, మండల పరిషత్ కార్యాలయాలు మరియు జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 189 క్లాస్-IV పోస్టులను ప్రభుత్వానికి సరెండర్ చేయడం ద్వారా అదనపు ఆర్థిక భారం లేకుండా ఈ ప్రతిపాదనను అమలు చేయవచ్చని ఆమె వివరించారు.అలాగే, జిల్లా పరిషత్ పరిధిలోని పాఠశాలలు, కార్యాలయాల్లో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న స్వీపర్లు, నైట్ వాచ్‌మెన్, గార్డెనర్లు, వాటర్ క్యారియర్లు వంటి క్లాస్-IV పోస్టులను APCOS/అవుట్‌సోర్సింగ్ విధానం ద్వారా భర్తీ చేయడానికి అనుమతి ఇవ్వాలని కూడా మంత్రి ని కోరారు. ఈ అంశానికి సంబంధించిన ప్రత్యేక లేఖను కూడా ఆమె సమర్పించారు.ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్  సమస్యలను సానుకూలంగా విన్నారని,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చైర్‌పర్సన్ తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా జిల్లా పరిషత్ నిరంతరం కృషి చేస్తుందని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

About Author