NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఘనంగా 11వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు : డా. అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో 11వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ పి. షేక్ షా వలీ ఖాన్ ప్రముఖ విద్యావేత్త, అఫ్జలుల్ ఉలమా డా. అబ్దుల్ హక్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. అబ్దుల్ హక్ విద్యా, సాహిత్య, భాషా రంగాలకు అందించిన విశేష సేవలను స్మరించుకున్నారు. ఉర్దూ భాషా సాహిత్యాల పరిరక్షణ, అభివృద్ధిలో ఆయన కృషిని కొనియాడారు.ఉర్దూ భాషా వికాసం, ఉన్నత విద్యా విస్తరణ లక్ష్యాలతో ఏర్పాటైన విశ్వవిద్యాలయం భవిష్యత్తులో మరింత విద్యా ప్రగతిని సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *