జాతీయ న్యాయ సేవ దినోత్సవం వేడుకలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక జిల్లా కోర్టు లోని న్యాయ సేవ సదన్ లో శ్రీమతి టి. లీలావతి , 4 వ అదనపు జిల్లా జడ్జి, ఇంచార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు ఛైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు వారు జాతీయ న్యాయ సేవ దినోత్సవం వేడుకలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ యందు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి టి. లీలావతి మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవ దినోత్సవ ప్రత్యేకత ను క్లుప్తంగా వివరించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 9 తేదీన, భారతదేశం జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపుకుంటుంది, ఇది సమాజంలోని బలహీన వర్గాలకు, పేదలకు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు మొదలగు వారికి చట్టపరమైన సహాయ చర్యలు అందించడానికి తోడ్పడుతుంది. 1994లో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అమలులోకి వచ్చిన వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకుంది అని తెలిపారు. అనంతరం ఏసీబీ కోర్టు అదనపు జిల్లా జడ్జి శ్రీమతి శ్రీవిద్య మాట్లాడుతూ మీడియేషన్ ద్వారా ఎక్కువ కేసులు పరిష్కరించబడుతున్నాయని తెలిపారు.ప్యారా లీగల్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయాన్ని గ్రామ గ్రామాలకు తీసుకువెళ్లి ప్రజలలో లీగల్ సర్వీసెస్ మరియు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎసిబి కోర్టు అదనపు జిల్లా జడ్జి యన్. శ్రీవిద్య, పోక్సో కోర్టు స్పెషల్ అదనపు జిల్లా జడ్జి ఈ. రాజేంద్ర బాబు, ఏడవదనపు జిల్లా జడ్జి వి.లక్ష్మీరాజ్యం, యం. వెంకట హరినాథ్ శాశ్వత లోకదాలత్ ఛైర్మన్ , ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి, అనిల్ కుమార్ ఎక్సైజ్ మేజిస్ట్రేట్,అపర్ణ ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి, ఐదవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి స్రవంతి, చంద్రుడు ప్రెసిడెంట్, కర్నూలు బార్ అసోసియేషన్, ట్రైనీ న్యాయమూర్తులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలు, న్యాయవాదులు, మధ్యవర్తులు, లా స్టూడెంట్స్, పారా లీగల్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.


