వట్లూరు గురుకుల జూనియర్ కాలేజ్ నుండి 145 మంది విద్యార్థినులు పరీక్షకు హాజరు
1 min read

పరీక్షలు రాసే కేంద్రాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం
కాలేజ్ ప్రిన్సిపాల్ దాసరి. ఝాన్సీ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరుజిల్లా వట్లూరు సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కాలేజీ నుండి ఈ ఏడాది 145 మంది విద్యార్థినులు పరీక్షలు రాస్తున్నారని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డి.ఝాన్సీ తెలిపారు,వట్లూరు గురుకుల జూనియర్ కాలేజీ నుండి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయబోవుచున్న 74 మంది విద్యార్థినులు ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు రాయబోవుచున్న 71 మంది విద్యార్థినులు మొత్తం 145 మంది విద్యార్థినులకు ఇంటర్ విద్యాశాఖ ఏలూరులో 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ప్రిన్సిపాల్ ఝాన్సీతెలిపారు, విద్యార్థులు ప్రతిరోజు వట్లూరు గురుకుల జూనియర్ కాలేజీ నుండి ఏలూరులో పరీక్షలు రాసే కేంద్రాలకు వెళ్లేందుకు విద్యార్థినుల సౌకర్యార్థంఆర్.టి.సి బస్ సౌకర్యం కూడా ఉందని తెలిపారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని ప్రిన్సిపాల్ శుభాకాంక్షలు తెలిపారు.


