కార్యకర్తలే నా బలం – ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండల కేంద్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం హోళగుందమండల సమావేశం నిర్వహించిన – ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి * మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటి వైస్సార్సీపీ పార్టీ వరకు హొళగుంద మండల ప్రజలు మెజారిటీ ఇస్తూనే వచ్చారన్నారు..హొళగుంద మండల ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ లో ఓట్ చోరి జరిగిందని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ భర్త ప్రభాకర్ చెప్పారు అన్నారు.మేన్నటి ఎలక్షన్ లో నాకు ఎక్కువ మెజార్టీ ఇచ్చిన మండలం హొళగుంద నే అని అన్నారు.రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో సర్పంచులు మరియు ఎంపీటీసీలకు నామినేషన్ వేసి గెలుస్తామని అన్నారు. ఆలూరు గడ్డ వైఎస్ఆర్సిపి అడ్డ అని తెలియజేశారు.గ్రామాలలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కలిసికట్టుగా సర్పంచులను ఎంపిటిసి లను గెలిపించాలని అని కోరడం జరిగింది. సూపర్ సిక్స్ హామీలు అట్టర్ ప్లాప్ అయ్యాయని అని అన్నారు.నా ఒక్క మాటతో ఇంతమంది వచ్చినందుకు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలుకు పేరుపేరునా ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే,గిరి, జడ్పిటిసి శేషప్ప, హోళగుందమండల కన్వీనర్ ఎం, షఫీ ఉల్లా, ఎంపీపీ తనయుడు ఈసా, వైస్ ఎంపీపీ హనుమప్ప, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


