డాక్టర్ బారికి చంద్రశేఖర్ కు ప్రతిష్టాత్మక మహాత్మా గాంధీ పీస్ అవార్డు
1 min read

కర్ణాటక బెంగళూరు జాతీయ నేర నియంత్రణ మండలి వారి ఘనసన్మానం
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణం లో ఆటోడ్రైవర్ గా జీవితం కొనసాగిస్తూ.., సూక్ష్మ కళాకారుడు తన ఆర్థిక స్థోమత మంచి ప్రతిభ మరియు సమాజ సేవలను కనబరుస్తున్నారు డాక్టర్ బారికి చంద్రశేఖర్ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తో పాటు 24 ప్రపంచ రికార్డులను, సామాజిక లఘు చిత్రాలు చిత్రకరించి జాతీయ అవార్డు సాధించిన, వియత్నాం ప్రపంచ విశ్వవిద్యాలయం చేత గౌరవ డాక్టరేట్ అలాగే ఇండియన్ ఫార్మ్ నుండి గౌరవ డాక్టరేట్ కలిపి మొత్తం రెండుసార్లు అందుకున్న ఎమ్మిగనూరు వాసిగా, 140 బియ్యపు గింజల పై 140 యోధుల, రాజకీయ నాయకుల మరియు సినీ నటుల రూపురేఖలను పెయింటింగ్ వేసిన ఘనత, అంతటితో ఆగకుండా తనవంతు సమాజ సేవ తో వరదలు వచ్చిన ప్రతిసారీ ఉదాహరణకు కేరళ చెంగనూరు వరదబాధితులకు, శ్రీకాకుళం సింగరాయగూడెం నిరుపేద తిత్లీ వరదబాధితులకు, విజయవాడ సింగరేణి కాలనీ వరదబాధితులకు, నేడు శ్రీ కాళహస్తీ మోంథా వరదబాధితులకు, కరోనా లాక్డౌన్ సమయంలో ప్రతి రోజుకు 20 కుటుంబాలకు బియ్యం కూరగాయలు ఉచిత పంపిణీ, దేశ నాయకుల జయంతి వర్ధంతి సందర్భంగా పాలు, పళ్లు పంపిణీ, కుల మతాలు చూడకుండా వారి పండుగలకు చీరలు/బట్టలు పంపిణీ, విద్య ఉచిత బోధనతో ఎంతో మంది పిల్లలకు బోధించి, పిల్లలను తీర్చిదిద్దారు. తన విద్యార్థులను జాతీయ మరియు రాష్ట్రీయ అవార్డులకు, రికార్డులకు ఎంపిక అయ్యే విధంగా తయారు చేసిన సూక్ష్మ కళాకారుడు, వివిధ రకాల సేవలను మరియు సామాజిక సేవ దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్న మన డాక్టర్ బారికి చంద్రశేఖర్ కు బెంగళూరు జాతియ నేర నియంత్రణ మండలి వారిచే అస్సాం గోవ్హాతి మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ ఫారం చైర్మన్ డాక్టర్ మనోజిత్ సింగా, జనరల్ సెక్రెటరీ డాక్టర్ వై. ఉమ్మెత్సోయి వారు అందిచె ప్రతిష్టాత్మక జాతీయ మహాత్మా గాంధీ శాంతి అవార్డు ను డాక్టర్ బారికి చంద్రశేఖర్ అందుకున్నారు. నేషనల్ క్రైమ్ కంట్రోల్ బోర్డ్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు కె. శ్రీధర్, కర్ణాటక రాష్ట్రం జిల్లాల అధ్యక్షులు గిరి యాదవ్ సూక్ష్మ కళాకారుడు డాక్టర్ బారికి చంద్రశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ బారికి చంద్రశేఖర్ ను పూల తో ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో రమణ, విశ్వనాథ్,కన్నడ శిఖండి మువీ డబ్బింగ్ ఆర్టిస్ట్ పాల్గొన్నారు.

