ఘనంగా వరసిద్ధి వినాయక నవరాత్రుల 3 వ వార్షికోత్సవాలు..
1 min read

విజయవాడ , న్యూస్ నేడు : మధుర నగర్ నేతాజీ రోడ్డు 5వ లైన్ లో నేతాజీ రోడ్డు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల ఘనంగా నిర్వహించారుఈ సందర్భంగా చాంద్ బాషా మీడియాతో మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి వినాయక ఉత్సవాలు నేతాజీ రోడ్డు గణేష్ ఉత్సవ కమిటీ తరఫున నిర్వహిస్తూ వస్తున్నామని ఈ సంవత్సరం 3 వా వార్షికోత్సవం సందర్భంగా వారి సిద్ధి వినాయకుని నవరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు సెప్టెంబరు నాలుగో తేదీన 3,500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని 5 వ తేదీన వినాయకుని లడ్లు 11 , కేజీ 10 కేజీల లడ్లు వేలంపాట నిర్వహిస్తున్నామని వేలంపాట అయిన వెంటనే డీజే తీన్మార్ తో కోలాటంతో వరసిద్ధి వినాయకుని ఊరేగిస్తూ మేళతాళాలతో నిమజ్జన కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు.ఈ మూడవ వార్షికోత్సవ వినాయకుని నవరాత్రుల ఉత్సవాలకు నేతాజీ రోడ్డు గణపతి కమిటీ కమిటీ సభ్యులందరూ ఎంతో క్రమశిక్షణతో భక్తి సద్దలతో కార్యక్రమాల్ని జయప్రదం చేశారని తెలిపారు.మండపానికి పర్మిషన్ ఇచ్చిన సిటీ పోలీస్ కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ కి ఉచిత విద్యుత్ అందించిన విద్యుత్ శాఖ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నేతాజీ రోడ్డు గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు కొండలరావు, ప్రభాకర్ రావు, లక్ష్మణరావు బ్రహ్మం సాయి ప్రసాద్ పండు సందీప్ కౌండిన్య నాని మిగతా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

