NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులు మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి 

1 min read

పత్తికొండ, న్యూస్ నేడు:  విద్యార్థులు తమ మానసిక ఆరోగ్యం పై అవగాహన పెంచుకోవాలని మోటివేషనల్ స్పీకర్ టి హర్ష కిరణ్ సూచించారు. గురువారం పత్తికొండ స్థానిక శాంతి టాలెంట్ హైస్కూల్లో  ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి విజయలక్ష్మి అధ్యక్షతన ప్రేరణాత్మక వక్త( మోటివేషనల్ స్పీకర్ )టి . హర్షకిరణ్ చే విద్యార్థిని విద్యార్థులకు మోటివేషనల్ ఉపన్యాసం ఇప్పించారు. ఈ సందర్భంగా ఆయన ఉపన్యసిస్తూ, జీవిత నైపుణ్యాలు ,జీవన ప్రగతి మరియు వృత్తి నైపుణ్యాలను గురించి సలహాలు ,సూచనలు పిల్లలకు తెలియజేశారు. విద్యార్థులు ఇప్పటినుండే మానసిక ఆరోగ్యంపై అవగాహన ఎలా సృష్టించుకోవాలి ?మానవుడు సంతోషంగా మరియు విజయవంతమైన, సమర్థవంతమైన జీవితాన్ని ఎలా గడపాలి ? అనే అంశాలపై అనేక చిట్కాలను పిల్లలకు వివరించారు. మంచి వ్యక్తిత్వాన్ని ,లక్ష్యసాధనను ఎలా అలవర్చుకోవాలి? కఠిన శ్రమ అంటే ఏమిటి?  దురాలవాట్లకు దూరంగా ఎలా ఉండాలి?తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను ఎలా గౌరవించాలి ?సమాజంలో ఎలా మెలగాలి? ఎలాంటి మిత్రులను కలిగి ఉండాలి? అనే విషయాలను కూలంకుశంగా వివరించారు.  ఈ కార్యక్రమంలో అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About Author