ఘనంగా అమరులు సుధాకర్ శెట్టి 5వ వర్ధంతి
1 min read

పోరాటాల పురిటిగడ్డ పత్తికొండ హోసూరు గ్రామంలో పార్టీకి వెన్ను, దన్నుగా సుధాకర్ శెట్టి సిపిఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా 5 వర్ధంతి
పత్తికొండ, న్యూస్ నేడు: పోరాటాల పురిటి పత్తికొండ మండలంలోని హోసూరు గ్రామం లో సిపిఎం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి అమరులైన సుధాకర్ శెట్టి సిపిఎం పార్టీకి చేసిన సేవలు మరువలేనివని సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన సుధాకర్ శెట్టి (సుగాలయ్య) 5వ వర్ధంతి పత్తికొండ పట్టణంలో కుమ్మరి వీధిలో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, పార్టీ శ్రేణులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హోసూరు గ్రామం నందు సిపిఎం పార్టీ కార్యకర్తలకు విన్నతన్నగా నిలిచిన కోట్రెటి సుధాకర్ శెట్టి, (సుగాలయ్య) సేవలు మరువలేనని అమరులైనా నేటికి పార్టీ కార్యకర్తల హృదయాల్లో నిలిచారని ఆయన కొనియాడారు. జోహార్ కోట్రెటి సుధాకర్ శెట్టి అని నినదించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి యం. రవిచంద్ర, సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు సురేంద్ర, గంగన్న,పత్తికొండ మండల వ్యవసాయ సంఘం గౌరవ అధ్యక్షులు దస్తగిరి, సిపిఎం పార్టీ మాజీ నాయకులు వెంకటేశ్వర్లు, ప్రజానాట్మండలి జిల్లా నాయకులు పి.కాసిం, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు దూదెకొండ దుగ్గెన్న, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభాకర్, ప్రజానాట్యమండలి మండల కార్యదర్శి రమేష్, తదితరులు పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి జోహార్ సుధాకర్ శెట్టి. (సుగలయ్య) అని నినదించారు.


