పేద ప్రజల హృదయనాడి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పేద ప్రజల హృదయమాడి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని పత్తికొండ మాజీ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవి అన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రం తుగ్గలి లో మంగళవారం వర్ధంతి సభ ఘనంగా జరిగింది. వైయస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాలలో స్థిరస్థాయిగా నిలిచిపోయారని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, వైఎస్ఆర్సిపి విభాగపు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, వైసిపి జిల్లా కార్యదర్శి మోహన్ రెడ్డి, వైసిపి ఐటి విభాగపు నియోజకవర్గ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సింగల్ విండో అధ్యక్షురాలు విజయలక్ష్మి వైఎస్ఆర్ వర్ధంతి సభకు హాజరయ్యారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి వైసిపి సీనియర్ నేత స్వర్గీయ ప్రతాపరెడ్డి ఇంటి నుండి ర్యాలీగా వెళ్లి వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతికై అహర్నిశలు శ్రమించిన నేత అని కొని యాడారు. 2008-09 మధ్య కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ మొదలు పెట్టి ఆ పధకం ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చేరువ చేసిన విద్యావేత్త అని అన్నారు. అలాగే ఏప్రిల్ 1,2007 న ఆరోగ్య శ్రీ,పధకం ప్రారంభించి ఈ పధకం ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించిన డాక్టర్ అని గుర్తు చేశారు. అంతేకాకుండా పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప సంస్కరణవాది వైయస్సార్ అని అన్నారు.

