ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
1 min read

ఎందరో త్యాగమూర్తులు త్యాగపలమే నేడు సిద్ధించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కళాశాల ప్రిన్సిపల్ వంగా వెంకటేశ్వరరావు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : స్థానిక సత్రంపాడు ఆదిత్య డిగ్రీ కళాశాలలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వంగా వెంకటేశ్వరావు ముందుగా మహ్మాతాగాంధీజీ, సుభాష్ చంద్రబోసు, భగత్సింగ్, భాల గంగాథర్ తిలక్, చిత్రపటాలకు పూలమాలల వేసి నివాళుర్పించారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల, త్యాగా పోరాటాల వల్ల మనకు స్వాతంత్య్రం లభించిదని తెలిపారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం ధీమ్ నవ్యభారత్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కళాశాల డి.వి.వి. ఫణికుమార్, ఎన్.యస్.యస్. ప్రోగామ్ ఆఫీసర్ కె. హరిబాబు, ఎ.ఓ కృష్ణ, తెలుగు అధ్యాపకురాలు పి. సౌభాగ్యలక్ష్మి, ఇంగ్లీషు అధ్యాపకురాలు శ్రావని, మరియు అధ్యాపక, ఆధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.


