మాజీ ఎమ్మెల్సీ ఆర్.ఎస్.ఆర్ మాస్టర్ కి సన్మానం
1 min read

జన వనరుల శాఖ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జాతీయ నాయకుల ఆదర్శాలను నేటి తరం ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలి
దేవరకొండ వెంకటేశ్వర్లు,డిఈ
ఏలూరు, న్యూస్ నేడు: జలవనుల శాఖలోని విజిలెన్స్ , ఎంక్వైరీస్ అండ్ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్ ధవలేశ్వరం పరిధిలో ఉన్న జె.వి.ఆర్ నగర్ ఏలూరు జిల్లా కార్యాలయంలో 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ శాసనమండలి సభ్యులు, ప్రముఖ సంఘ సేవకులు ఆర్ఎస్ఆర్ మాస్టర్ హాజరయ్యారు.ప్రత్యేక అతిధులుగా విశ్రాంత తహసిల్దార్ గుబ్బల నాగేశ్వరరావు, ప్రముఖ జర్నలిస్ట్ కె.బాలశౌరి,విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ద్రోణాదుల శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై నాటి త్యాగమూర్తుల త్యాగ ఫలాలను వివరించారు.ఈ కార్యక్రమంలోజల వనరుల శాఖకు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ మేరీ ప్రిసిల్లా, మాధవరావు, ప్రభు తేజ, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ తో పాటు సామాజిక వేత్తలైన పెరియార్,దేవరపల్లి రత్నబాబు, దేవరకొండ లలిత, అల్లం రాధా కృష్ణ కుమారి, కట్ట నాగమణి, కొమ్మోజు శ్రీనివాస్, బొబ్బిలి నటరాజు, నాగ సౌజన్య , వెంకన్న , చెస్ ఛాంపియన్ దేవరకొండ ఎల్.వి. విజ్ఞాన్ భరత్, ఆనంద్ శ్రీదేవి , తదితరులు పాల్గొన్నారు. వేడుకలు అనంతరం ఆర్ఎస్ఆర్ మాస్టారినీ జల వల్ల శాఖ అధికారులు, సామాజికవేత్తలు సన్మానించారు.

