NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్నబ్‌ అతి తీవ్ర తుఫాన్‌ తీరం దాటిన క్రమంలో ఎమ్మెల్యే పర్యటనలు

1 min read

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

నగర వ్యాప్తంగా స్వీయ పర్యటనలు, స్థానిక ప్రజలతో మమేకమవుతూ పరిస్థితులను అంచనా

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అర్నబ్‌ అతి తీవ్ర తుఫాన్‌ తీరం దాటిన క్రమంలో పరిస్థితి మరింత భీకరంగా ఉంటుందనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి బుధవారం ఉదయం నగర వ్యాప్తంగా స్వీయ పర్యటనలు చేపట్టారు. ఒకపక్క స్థానిక ప్రజలతో మమేకమవుతూ పరిస్థితులను అంచనా వేస్తూ వచ్చారు. ఇదేసమయంలో వారిలో ధైర్యాన్ని నింపారు. అలాగే మరోపక్క సంబంధిత అధికారులకు అక్కడికక్కడే స్పష్టమేన సూచనలు చేస్తూ వచ్చారు. ఇంకోపక్క పారిశుద్ద్య పనుల నిర్వహణను సైతం ఎమ్మెల్యే చంటి స్వయంగా పర్యవేక్షించారు. దీంతో బుధవారం నగరంలో ఆయన చేసిన పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు సంఘటనల మినహా పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల ముందస్తు చర్యల ఫలితంగానే ఇదంతా సాధ్యమైందని స్పష్టం చేసిన ఆయన నగరంలో సైతం అదేరకమైన చర్యలు అర్నబ్‌ వంటి తీవ్ర తుఫాన్‌లో సైతం నగరంలో చుక్కనీరు నిల్వకుండా చేశాయంటూ వ్యాఖ్యానించారు. తుఫాన్‌ ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఇదేసమయంలో ఆయన కాస్సేపు టీ తాగుతూ అక్కడి స్థానికులతో మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, టీడీపీ సీనియర్‌ నాయకులు బెల్లపుకొండ కిషోర్‌, చల్లా విజయ్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *