NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డివిజన్ సమస్యల పరిష్కారాల కోసం కృషి చేసి,మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా…

1 min read

మీ ఓటు ఒక వ్యక్తి గెలుపు కోసం కాదని,మన డివిజన్ భవిష్యత్తు కోసమని ఆలోచన చేయాలి

1వ డివిజన్ ఇండిపెండెంట్    కార్పొరేటర్ అభ్యర్థి నెర్సు గంగరాజు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నేను మీకు ఎన్నో హామీలు ఇచ్చి మిమ్మల్ని మభ్యపెట్టాలని అనుకోవడం లేదు. మీ సమస్యలను వినాలి, సాధ్యమైన పరిష్కారాల కోసం కృషి చెయ్యాలి, మీకు ఎప్పుడూ అందుబాటులో వుండాలన్నదే నా లక్ష్యం అని  ఒకటవ డివిజన్ ఇండిపెండెంట్    కార్పొరేటర్ అభ్యర్థి నెర్సు గంగరాజు అన్నారు. ఏలూరు నగరపాలక సంస్థలో జరిగే ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ గుర్తుతో పోటీ చేస్తున్నారు. ఆయన డివిజన్ ఓటర్లకు సందేశమిస్తూ నేనుగెలిచిన తర్వాత ప్రజల మధ్యకి రావడం కాదు.ప్రజల మధ్య ఉంటూ, వారి నమ్మకాన్ని గెలుచుకోవడమే నిజమైన న్యాయకత్వమన్నరు.మీ కష్టాల్లో మీకు తోడుగా వుంటాను. మీ సమస్యల పరిష్కారం కోసం అధికారుల దగ్గరకు వెళ్తాను. పరిష్కరిస్తాను.డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మీరు వేసే ప్రతీ ఓటు ఒక వ్యక్తి గెలుపు కోసం మాత్రమే కాదు.మన డివిజన్ భవిష్యత్తు కోసం అని ఆలోచన చైయ్యలన్నారు.నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీ నమ్మకాన్ని పరిపూర్ణంగా  విజయవంతంగా ముందుకు  తీసుకెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నారన్నరు. గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటేసి నాకు అఖండ విజయాన్ని చేకూర్చాలని గంగరాజు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *