NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అన్నా క్యాంటీన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

1 min read

ఆహార పదార్థాలు నాణ్యత పరిశీలన

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : అన్నా క్యాంటీన్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక నరసింహారావు పేటలో ఇండోర్ స్టేడియం వద్దగల అన్నా క్యాంటిన్ ను బుధవారం రాత్రి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఆహార పదార్థాలు నాణ్యతను పరిశీలించి, ఆహార పదార్దాల రుచి,  నాణ్యతలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పేదల ఆకలిని తీర్చేందుకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అన్నా క్యాంటిన్లను ఏర్పాటుచేసిందని, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అన్నా క్యాంటీన్ల ద్వారా రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత అన్నా క్యాంటీన్ నిర్వాహకులపై ఉందన్నారు.  ప్రభుత్వం నిర్దేశించిన 5 రూపాయల ధరకన్నా ఎక్కువ వసూలు చేయవద్దని, ఉదయం మిగిలిన ఆహార పదార్థాలను సాయంత్రం సమయంలో ఎట్టిపరిస్థితులలోనూ ప్రజలకు అన్నా క్యాంటీన్ పరిసరాలు ఎప్పటికప్పుడు  పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రజలు ఆహరం తిన్నతరవాత ప్లేట్ లను విమర్శలకు తావులేకుండా పూర్తిగా శుభ్రంచేయాలన్నారు.   కలెక్టర్ వెంట ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ భానుప్రతాప్, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author