NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ మఠంలో శ్రీ వదీంద్ర తీర్థ ఆరాధన మహోత్సవం

1 min read

మంత్రాలయం , న్యూస్​ నేడు :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం లో శ్రీ వదీంద్ర తీర్థుల ఆరాధన శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  శ్రీ వదీంద్ర తీర్థుల పవిత్ర మూల బృందావనానికి ప్రత్యేక పంచామృత అభిషేకం చేశారు. అనంతరం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు వదీంద్ర తీర్థుల చరిత్ర గురించి భక్తులను వివరించారు.  అనంతరం వదీంద్ర తీర్థుల చిత్ర పటాన్ని స్వర్ణ రథంపై ఉంచి భక్తుల హర్షధ్వనుల మద్య భాజభజంత్రీల మద్య మఠం ప్రాకారంలో ఊరేగించారు. పండితులు అందించిన జ్ఞానోదయ ప్రవచనాలతో కొనసాగాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరికీ ఆశీస్సులు  ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని పీఠాధిపతులు దివ్య అనుగ్రహ సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మఠం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

About Author