NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనుమతులులేని ఆధార్ సేవ కేంద్రలపై చర్యలుతీసుకోవాలి…

1 min read

పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో జేసీ నవ్య కు వినతి…

ఎమ్మిగనూరు  న్యూస్ నేడు:   ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి గాంధీ సర్కిల్, ఏద్దుల మార్కెట్ ఆధర్ సేవ కేంద్రాలు స్కూల్ డిపార్ట్మెంట్ పేర్లతో  ఇష్టనుసారంగా డబ్బులు దండుకుంటున్న ఆధార్ కేంద్ర నిర్వాహకులపై చర్యలుతీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్ధి సంఘం(పి.డి.యస్.యు) జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మహేంద్ర బాబు డిమాండ్ చేశారు.సోమవారం కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ప్రజా సమస్యల పరిస్కార వేదిక లో జేసీ నవ్య కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ కేంద్ర నిర్వాహకులు ప్రభుత్వానికి విరుద్ధంగా వ్యక్తిగత సెంటర్లో ఏర్పాటు చేసుకొని పర్మిషన్లు లేకుండా వేరే వాళ్ళ లాగిన్లతో పేరు చేంజ్ కి,అడ్రస్ చేంజ్ కి డేట్ అఫ్ బర్త్ చేంజ్ కి 100రూ” నుండి 500 రూ” రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఎంఆర్ఓ కు ఫిర్యాదు చేసిన కూడా చూసించుడనట్లు ఉండడం దారుణం అన్నారు.అలాగే విద్యార్థులు, ప్రజల అవసరలా ఆసరాచేసుకొని వారికీ ఇష్టనుసారంగా డబ్బులు వసూలుచేస్తున్న ఆధార్ కేంద్ర నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలనీ వారు డిమాండ్ చేశారు… ఈ కార్యక్రమం లో నాయకులు ధనుష్, అమిర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

About Author