పగిడ్యాల,మద్దూరు సొసైటీ చైర్మన్ల..ప్రమాణ స్వీకారం
1 min read

కాలువకు నీళ్లు విడుదల
రైతులకు డ్రోన్లు పంపిణీ
హాజరైన మాండ్ర శివానందరెడ్డి..ఎమ్మెల్యే
నందికొట్కూరు, న్యూస్ నేడు: మద్దూరు మరియు పగిడ్యాల సహకార సొసైటీ నూతన చైర్మన్ లుగా కామిరెడ్డి జనార్దన్ రెడ్డి,దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సోమవారం ఉదయం నుండి బిజీగా ఉన్నారు.ఉదయం పాములపాడు మండలం మద్దూరు గ్రామంలో జరిగిన సూపరి పాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలను అందజేశారు.జూపాడుబంగ్లా మరియు తాటిపాడు నాయకులు గోరే సాహెబ్, మన్సూర్ గాయపడడంతో వారిని పరామర్శించారు.తర్వాత మద్దూరు సహకార సొసైటీ చైర్మన్ కామిరెడ్డి జనార్దన్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే మరియు మాండ్ర శివానందరెడ్డి హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. పాములపాడు మండలం లింగాల ఇరిగేషన్ ద్వారా రైతులకు పంట పొలాల సాగు కొరకు కాలువకు నీళ్లను విడుదల చేశారు.మధ్యాహ్నం పగిడ్యాల సహకార సొసైటీ చైర్మన్ గా దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే మరియు శివానందరెడ్డి సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. దామోదర్ రెడ్డి పూల బోకేతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మరియు శివానందరెడ్డి నూతన చైర్మన్ లకు శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు అందుబాటులో ఉండి సొసైటీలను ముందుకు నడిపిస్తామని నూతన చైర్మన్లు అన్నారు.అంతే కాకుండా వివిధ గ్రామాల నాయకులు నూతన చైర్మన్ అభినందించారు.నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన రైతులకు డ్రోన్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్,80 బన్నూరు పరమేశ్వర్ రెడ్డి, దేవళ్ల మురళీ,రవీంద్రారెడ్డి,గిరీశ్వర్ రెడ్డి,కాతా రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


