NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సైబర్ మోసానికి గురైన బాధితుడికి రూ.1,64 వేల అందజేత

1 min read

రికవరీ సొమ్ము అందజేసిన జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్

ఏపీకే రూపంలో వచ్చిన లింక్ ( ఓటిపి లను) ఓపెన్ చేయరాదు

సైబర్ నేరగాళ్ల లింకులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : సైబర్ మోసానికి గురైన బాధితుడికి రూ.1,64,000 రూపాయలను  ఏలూరు జిల్లా కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ సదరు డబ్బులను  రికవరీ చేసి బుధవారం 14.07.2025 వ నాడు ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు బాధితుడికి అంద చేసినారు. ఏలూరు జిల్లా కైకలూరు టౌన్ పోలీస్ శాఖ సైబర్ నేరానికి వెంటనే స్పందించి, బాధితుడు కోల్పోయిన రూ. 1,64,000/-ను తిరిగి  అందజేయడం జరిగినది. సదరు మొత్తమును ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ చేతుల మీదుగా బాధితునికి అంద చేసినారు.బాధితుడు సైబర్ నేరానికి గురైనటువంటి విధానంకైకలూరు మండలం తామరకొల్లు గ్రామానికి చెందిన ప్రత్తిపాటి శ్రీనివాసరావు ఇటీవల తనకు గల సెల్ ఫోన్ కు సోషల్ మీడియా లో ఏపీకే ఫైలు రూపంలో వచ్చిన అనుమానాస్పద లింక్‌ ను  13.05.2025 నాడు అనాలోచితంగా ఓపెన్ చేసినట్లు,ఆయన బ్యాంక్ ఖాతా నుంచి మొత్తం రూ. 1,64,000/- మోసపూరితంగా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు. తక్షణమే అప్రమత్తమైన శ్రీనివాసరావు  బ్యాంకు అధికారులను సంప్రదించిన ప్రత్తిపాటి శ్రీనివాసరావు  ఎకౌంటు నుండి 1,64 వేల రూపాయలను సైబర్ నేరగాళ్లు తస్కరించినట్లు వెంటనే శ్రీనివాసరావు  కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ ని సంప్రదించారు. వెంటనే కేసును పరిశీలించిన కైకలూరు టౌన్ పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగంతో సమన్వయంతో పనిచేసి బాధితుని బ్యాంక్ ఖాతా లో పోగొట్టుకున్న మొత్తాన్ని సైబర్ నేరగాళ్ల నుండి రికవరీ చేసి తిరిగి అందించేలా చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా బాధితుడు పోలీసు అధికారుల సహకారానికి కృతజ్ఞతలు తెలియ చేసినారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆధునిక కాలంలో సైబర్ నేరని కి వివిధ రకాలుగా నేరాలకు పాల్పడుతున్నట్లు ఇప్పుడున్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ద్వారా విదేశాలలో ఉన్న వ్యక్తులు కూడా తెలుగులో మాట్లాడగలుగుతున్నారని అటువంటి ఫోన్ కాల్స్ ను నమ్మి వారు పంపించే ఏపీకే యాపులను గాని లింకులు గానీ లేదా ఓటీపీలు గాని ఓపెన్ చేయకూడదని, అందులకు విరుద్ధంగా ఎవరైనా ఆకర్షితులై సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వచ్చేటటువంటి సందేశాలకు స్పందించకూడదని ఎవరైనా సైబర్ నేరాలకు గురైన వెంటనే 1930కి తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిఎస్పి డి శ్రావణ్ కుమార్, కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author