సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని సమిష్టిగా నిర్వహించాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు:కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి అధ్యక్షతన అలూరు అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం ఈ రోజు తేది 17.07.2025న సాయంత్రం జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం, కర్నూలు నందు నిర్వహించడం జరిగింది.ఈ సమావేశమునకు కర్నూలు జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు, ఎం.పి శ్రీ బస్తిపాటి నాగరాజు, ఎం.ఎల్.సి శ్రీ బి.టి.నాయుడు, అలూరు నియోజకవర్గం పార్టీ పరిశీలకులు శ్రీ పూల నాగరాజు లు ముఖ్యులుగా హాజరుకావడమైనది.సమావేశంలో వీరు మాట్లాడుతూ సుపరిపాలలో తొలి అడుగు కార్యక్రమం మరింత ముమ్మరంగా సమిష్టిగా నిర్వహించాలని సూచించడం జరిగింది. కార్యక్రమానికి 2024 అలూరు నియోజకవర్గం పార్టీ అభ్యర్ధి బి.వీరభద్ర గౌడ్, రాష్ట్ర వాల్మీకి సంక్షేమ , డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, నియోజకవర్గం పార్టీ ముఖ్య నాయకులు వైకుంటం జ్యోతి, వైకుంటం శివ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్ (ఆలూరు), విజయ భాస్కర్ గౌడ్ (దేవనకొండ), గుమ్మనూరు సుధాకర్ (హాలహర్వి), పరమా రెడ్ది (ఆస్పరి), టి.టిప్పయ్య (హోళగుంద), క్లస్టర్ ఇంచార్జీలు జి.వీరేష్ (క్లస్టర్ 2) ప్రహలాద రెడ్డి (క్లస్టర్ 3), ఐ.మీనాక్షి నాయుడు (క్లస్టర్ 4), సి.ఎస్.నారాయణ రెడ్డి (క్లస్టర్ 5), రాజశేఖర్ (క్లస్టర్ 6), పి.వెంకటేశ్వర చౌదరి (క్లస్టర్ 7), కె.నర్సి రెడ్డి (క్లస్టర్ 8), బి.పెద్ద రంగన్న (క్లస్టర్ 9) మొదలగు వారు పాల్గొన్నారు.

