మిడుతూరులో వైద్య శిబిరానికి విశేష స్పందన..
1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు :నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో చౌడేశ్వరీ దేవాలయంలో శనివారం డాక్టర ఎంఎం భాష ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఇక్కడ భాష ఆధ్వర్యంలో 26వ ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.ఈ శిబిరంలో 130 మందికి పైగా రోగులకు ఉచిత వైద్య చికిత్సలు డాక్టర్లు అందించారు.ఈ శిబిరంలో రోగులకు రక్తపోటు(బీపీ), మధుమేహం(షుగర్)తో పాటు సాధారణ ఆరోగ్య పరీక్షలు (జనరల్ చెకప్) నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కర్నూలులోని విజయ హాస్పిటల్ నుండి వచ్చిన వైద్యులు,జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కిరణ్,కంటి వైద్యులు డాక్టర్ ప్రసాద్ రోగులకు చికిత్సలు చేసి వారికి తగిన సలహాలు ఇస్తూ ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు.ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా పలువురు పేదలకు,అవసరమైన వారికి ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.

