ప్రతి ఒక్కరు చెట్లు నాటండి- పర్యావరణాన్ని కాపాడండి
1 min read

ప్లాస్టిక్ రహిత సమాజమే ద్వేయంగా పని చేద్దాం
ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు
చెన్నూరు, న్యూస్ నేడు: ప్రతి ఒక్కరు పచ్చదనాన్ని కాపాడి, ప్లాస్టిక్ రహిత సమాజానికి దోహదపడాలని ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు అన్నారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ లో భాగంగా సచివాలయ సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు ఏఎన్ఎంలతో గ్రామంలోని పురవీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతున్నదని దీంతో ప్రజలు అనేక ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు పాటుపడాలని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ రహిత ఆరోగ్య సమాజం కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అందరితో ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరచుకోవాలని, గ్రామంలో ఎక్కడైనా వర్షపు నీరు నిలువ ఉంటే అక్కడ ఉండే గుంతలను పూడ్చివేసేయాలని ఆయన తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీజన్ వ్యాధులు ప్రభల్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆయన తెలియజేశారు. అదేవిధంగా మండలంలోని రామనపల్లె గ్రామపంచాయతీ కార్యదర్శి గురువేశ్వరరావు ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తడి చెత్త, పొడి చెత్త పర్యావరణ పై ప్లాస్టిక్ ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ఎంఈఓ గంగిరెడ్డి, ఈ ఓ పి ఆర్డి సురేష్ బాబు, ఆరోగ్య సిబ్బంది అంగన్వాడి కార్యకర్తలు ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

