NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా పాఠశాలల్లో కొన్ని మౌలిక సదుపాయాల కొరతలు

1 min read

జల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి కి వినతి పత్రం అందజేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్

సమస్యలు పరిశీలించి పరిష్కారం పై దృష్టి సారిస్తామన్న కలెక్టర్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  :ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మంగళవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ని కలిసి ఏలూరు జిల్లాలో విద్యాభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలపై చర్చించారు. భీమడోలు మండలం పొలసానిపల్లి లోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగిందని, పాఠశాలలో కొన్ని మౌలిక సదుపాయాల కొరత ఉన్నాయని, వాటికి మరమ్మత్తులు చేయించవలసిందిగా కోరారు.  తన పరిశీలనలో  తరగతి గదుల పైకప్పులు లీక్ అవుతున్నాయని, తలుపులు తుప్పు పట్టి ఉండడం, పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు మరియు గడ్డి ఎక్కువగా ఉంది శుభ్రత నిర్వహణ లోపాలున్నాయని కలెక్టర్ దృష్టికి ఘంటా పద్మశ్రీ తీసుకువచ్చారు. ఈ పాఠశాలలో దాదాపు 600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని,  వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే ఈ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, విద్యాభ్యాసనకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంపై  ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి  ప్రాధాన్య పూర్వకంగా మరమ్మతులు, పరిశుభ్రత మరియు మౌలిక సదుపాయాల మెరుగుదలపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ కోరారు.  సమస్యలను పరిశీలించి తగు చర్యలు తీసుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీకి తెలియజేసారు.

About Author