NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారత తపాలా శాఖ అడ్వాన్సుడ్ పోస్టల్ టెక్నాలజీ 2.0 (ఏపిటి 2.0) ప్రారంభం

1 min read

దేశవ్యాప్తంగా అన్ని తపాలా కార్యాలయాలు నేడు ఆవిష్కరణ

ఏలూరు డివిజన్ తపాలా కార్యాలయం లో ప్రారంభించిన సూపర్డెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఎస్.శ్రీకర బాబు

ప్రముఖ పాత్ర వహించిన డివిజన్ లోని సిస్టం అడ్మినిస్ట్రేటర్ల కు సన్మానం

తపాలా శాఖ సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : డిజిటల్ ఇండియా చొరవలో భాగంగా భారత తపాలా శాఖ అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0 (ఏపిటి 2.0). మంగళవారం దేశవ్యాప్తంగా అన్ని తపాలా  కార్యాలయాలలో ప్రారంభించడం జరిగిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఎస్. శ్రీకర్ బాబు తెలిపారు. ఈ నూతన సాఫ్ట్వేర్ వలన ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన, స్నేహపూర్వకమైన సేవలను అందించడం జరుగుతుందన్నారు. అలాగే భవిష్యత్తులో వినియోగదారుల అవసరాల నిమిత్తం మరిన్ని సేవలు అందించడంలో ఈ  కొత్త వ్యవస్థ దోహదపడుతుందన్నారు.  ఈ కొత్త న్యూ జనరేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఏలూరు డివిజన్ లో ప్రధాన తపాలా కార్యాలయంలో ప్రారంభించడానికి ఏలూరు వారు విచ్చేసి ఈ నూతన విధానాన్ని ప్రారంభం చేసి ప్రజలకు అంకితం చేశారు.  ఈ సందర్భంగా ఈ కొత్త వ్యవస్థను తీసుకు రావడంలో ప్రముఖ పాత్ర వహించిన ఏలూరు డివిజన్ లోని సిస్టం అడ్మినిస్ట్రేటర్లను శ్రీకర్ బాబు సన్మానించారు. ప్రజలందరూ ఈ కొత్త వ్యవస్థ ద్వారా తపాలా శాఖ సేవలను ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సూపర్డెంట్  డి.శ్రీనివాసరావు, డి.శ్రీకాంత్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్స్ ఏలూరు సౌత్ సబ్ డివిజన్ ,  యు. చంద్రశేఖర్ , ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్స్ ఏలూరు నార్త్ సౌత్ డివిజన్,  డి.రంగారావు,  పోస్ట్ మాస్టర్ ఏలూరు హెడ్ పోస్ట్ ఆఫీస్ మరియు హెడ్ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author