ఇబ్బందులు తలెత్తకుండా యూరియా..డీఏపీ..
1 min read

నూతన సొసైటీ చైర్మన్ ముర్తుజావలి
నందికొట్కూరు, న్యూస్ నేడు : వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని నూతన సహకార సొసైటీ చైర్మన్ ఎస్ ముర్తుజావలి అన్నారు. మంగళవారం నందికొట్కూరు పట్టణంలోని సహకార సొసైటీ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ యూరియా,ఎరువులు సమృద్ధిగా రైతులకు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని అన్నారు.రైతులు యూరియా కోనుగోలు చేయాలని యూరియా దొరకదు అనే తప్పుడు సమాచారాల వల్ల చాలా మంది రైతులు ముందస్తుగానే రెండవ దఫా,మూడవ దఫా ఎరువులు కొని దాచుకుంటున్నారని అన్నారు. అలా కాకుండా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే కొనుగోలు చేయాలని సూచించారు.ప్రస్తుతం సొసైటీలో యూరియా, కాంప్లెక్స్,డిఏపీ 1,040 బస్తాలు అందుబాటులో ఉందని రైతులు అధైర్య పడవద్దని తెలిపారు.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అవసరమైన ఎరువులను తీసుకెళ్లుకోవాలని అయన సూచించారు.ఈ సమావేశంలో సొసైటీ సీఈఓ రబ్బానీ,పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, యూనిట్ ఇన్చార్జి వేణుగోపాల్,మాజీ కౌన్సిలర్ సత్తార్ మియా, కుమార్,మైనార్టీ నాయకులు అబ్దుల్లా,వార్డు ఇన్చార్జ్ లింగారెడ్డి పాల్గొన్నారు.

