NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పంటలకు క్రాఫ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి:ఎంఏఓ

1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : వేసిన ప్రతి పంటకు క్రాఫ్ ఇన్సూరెన్స్ ను తప్పనిసరిగా చేయాలని మండలం వ్యవసాయ అధికారి ఎం పీరు నాయక్ రైతులతో అన్నారు.బుధవారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు, సుంకేసుల గ్రామాల్లో “పొలం పిలుస్తోంది”అనే కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ ఖరీఫ్ లో సాగుచేసిన పంటలు మొక్కజొన్న,కంది పంటల యాజమాన్యాల గురించి వివరించారు.ఖరీఫ్ లో వేసిన పంటలకు క్రాఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.అదే విధంగా అన్నదాత సుఖీభవ జాబితా లో పేర్లు లేనట్లయితే ఈ నెల 23వ తేదీ లోగా ఆర్ఎస్ కె కి వెళ్ళి రైతులు పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈవోలు అశోక్,మల్లికార్జున రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.

About Author