హంద్రీ నీవా విస్తరణ పనులను పరిశీలించిన కలెక్టర్
1 min read

హెచ్ఎన్ఎస్ఎస్ నుండి నీరు విడుదల అవుతున్న సందర్భంగా గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయండి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు నగరానికి నీటి సమస్య తలెత్తకుండా నీటి పారుదల సలహా మండలి సమావేశ తీర్మానం ప్రకారం హెచ్ఎన్ఎస్ఎస్ నుండి నీరు విడుదల అవుతున్న సమయంలోనే గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా హెచ్ఎన్ఎస్ఎస్ డిఈ ని ఆదేశించారు.బుధవారం కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం వద్ద హంద్రీ నీవా విస్తరణ పనులను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ హంద్రీ నీవా ను పరిశీలిస్తూ నీటి ప్రవాహం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.. గతంలో మాదిరిగానే ఈసారి కూడా హంద్రీ నీవా నీటితో 68 చెరువులను కూడా నింపే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హెచ్ఎన్ఎస్ఎస్ ఇంజనీర్ లను ఆదేశించారు… అదే విధంగా కాలువ వెంబడి ఉన్నటువంటి కృ ష్ణగిరి రిజర్వాయర్, పత్తికొండ రిజర్వాయర్ మరియు అన్ని తూముల ద్వారా ఆయకట్టుకు నీటిని ఇవ్వాలని కలెక్టర్ హెచ్ ఎన్ ఎస్ ఎస్ ఇంజనీర్లను ఆదేశించారు..కార్యక్రమంలో హెచ్ఎన్ఎస్ఎస్ ఇంచార్జి ఈ ఈ ప్రసాద్ రావు, డి ఈ ఈ కొండన్న, చెన్నయ్య, కల్లూరు తహసిల్దార్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

