NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అలగనూరు,నాగటూరులో ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే

1 min read

ప్రజా సమస్యలను తెలుసుకుంటూ

అభివృద్ధి సంక్షేమం మాతోనే సాధ్యం ఎమ్మెల్యే జయసూర్య..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మాతోనే సాధ్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.గురువారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని అలగనూరు గ్రామంలో ఉదయం “సుపరిపాలనలో తొలి అడుగు”అనే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి సంవత్సర పాలన కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు నందికొట్కూరు ఎమ్మెల్యే.. మీకు పథకాలు అందుతున్నాయా అంటూ ప్రజలను అడుగుతూ వారు సమస్యలను ఎమ్మెల్యే విన్నారు.పింఛన్లు,గృహాలు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని అదేవిధంగా డ్రైనేజీ కాలువల గురించి ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.అంగన్వాడీ కేంద్రాలను ఎమ్మెల్యే తనిఖీ చేయగా ఒక కేంద్రానికి మరుగుదొడ్డి లేకపోవడంతో వాటిని కట్టించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి అక్కడ చేస్తున్న భోజనం గురించి వంట నిర్వాహకులతో మాట్లాడారు.ఏబీఎం చర్చికి స్థలం కావాలని ఎమ్మెల్యేను కాలనీవాసులు అడగ్గా చర్చికి స్థలం ఇవ్వాలని తహసిల్దార్ ను ఎమ్మెల్యే ఆదేశించారు.సాయంత్రం నందికొట్కూరు మండలం నాగటూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలోమండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,ఏఎంసీ వైస్ చైర్మన్ సుధాకర్ యాదవ్,మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,వెంకటేశ్వర్లు యాదవ్,ఎంపీడీవో దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు,పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు ప్రతాప్ రెడ్డి,విశ్వనాథ్ మరియు వంగాల శివరామిరెడ్డి,శేషి రెడ్డి, మాజీ సర్పంచ్ రామస్వామి రెడ్డి,షబ్బు,నాగటూరు మాజీ సొసైటీ చైర్మన్ ఉశేనయ్య  తదితరులు పాల్గొన్నారు.

About Author