చదువుతో జీవితానికి భద్రత ఏర్పడుతుంది.. డా. మల్లికార్జున వెల్లడి
1 min read

ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు మండల పరిధిలో బోడబండ గ్రామంలో విద్యార్థులు చదువుకోవడం వలన జ్ఞానం, నైపుణ్యాలు సంపాదించడమే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారని ఎమ్మిగనూరు శ్రీ మల్లికార్జున ఆర్థోపెడిక్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సి. మల్లికార్జున, యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అధినేత కె. భీరప్ప, ప్రధానోపాధ్యాయులు డి. నాగన్న పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మల్లికార్జున ఆర్థోపెడిక్ హాస్పిటల్, యాపిల్ ల్యాబ్ ఆధ్వర్యంలో ఉచితంగా నోటు పుస్తకాలు, పెన్నులు అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చదువు విద్యార్థుల జీవితంలో స్థిరత్వాన్ని, భద్రతను అందిస్తుందన్నారు. చదువు వలన ఆలోచన విధానం మెరుగుపడుతుందని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నల్లన్న, ప్రమీల, హాస్పిటల్ మేనేజర్ నరసింహులు, గ్రామ పెద్దలు తమ్మయ్య, మార్లపాటి వెంకటేశ్వర్లు, పైరాజ్యం వెంకటరాముడు, సురేష్ చౌదరి, జగదీశ్ చౌదరి, పైరాజ్యం తిక్కయ్య, కడివెళ్ళ హనుమంతు, వడ్డే మధు, ప్రహ్లాద, చెన్నప్ప, కురువ శంకర్ పాఠశాల చైర్మన్, వైస్ చైర్మన్ లు పైరాజ్యం వీరేష్, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

