లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో ధ్వజరోహణ పూజ
1 min read

కౌతాళం , న్యూస్ నేడు : మండల పరిధిలోగల ఉరుకుంద గ్రామంలో శ్రావణమాసం ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా ధ్వజారోహణ పూజ కార్యక్రమం ఆలయ డిప్యూటీ కమిషనర్ మేడిపల్లి విజయరాజు దంపతులు పూజ నిర్వహించారు. శ్రావణమాస ఉత్సవం భాగంగా నిర్వహించే ఒక ముఖ్యమైన కార్యక్రమం ధ్వజస్తంభంపై పవిత్రమైన నూతన వస్త్రాన్ని ఎగురవేసి, గోపూజ, గణపతి పూజ, చేశారు.వేద పండితులు మంత్రాలను పటిస్తూ దైవానికి ఆహ్వానం పలుకుతూ, ఉత్సవాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ధ్వజారోహణ అనేది ఆలయ ఉత్సవాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది దైవానికి ఆహ్వానం పలికి, ఉత్సవాలన్నిటినీ విజయవంతంగా పూర్తి చేయమని కోరుతూ చేసే పూజా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పురహితులు, ప్రధాన అర్చకులు ఈరప్ప స్వామి ఉప ప్రధాన అర్చక మహాదేవ నాగరాజు స్వామి, అర్చకులు ఆలయ సూపర్డెంట్, వెంకటేష్ , మల్లికార్జున , కుమార్ ,కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.

