NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలీసు ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కార్యక్రమం

1 min read

ఆధారిత డిజిటల్ విధానాన్ని వినియోగించి,ఫిర్యాదుల పరిష్కార వేదిక

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు:  ఏలూరులో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కార్యక్రమం ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డిజిటల్ విధానాన్ని వినియోగించి, ఫిర్యాదుల పరిష్కార వేదిక ను నిర్వహించిన ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్. ఏలూరు జిల్లా ఎస్పీ  కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్, అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్.సూర్య చంద్రరావు ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కార్యక్రమం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డిజిటల్ విధానాన్ని వినియోగించి, ఫిర్యాదుల స్వీకరణ ను పారదర్శకంగా, పేపర్‌ లెస్‌ గా నిర్వహించారు. ఫిర్యాదుదారులు స్వయంగా ఏఐ బోట్‌ కు తమ ఫిర్యాదులు తెలియ చేసిన వెంటనే డాక్యుమెంటు గా తయారయ్యే విధంగా సాంకేతికతను ఉపయోగించారు.ప్రజలు తమ యొక్క డబ్బులను సమయమును వృధా చేసుకోకుండా మీ యొక్క ఫిర్యాదులను సమీప సబ్‌ డివిజన్, సర్కిల్ లేదా జిల్లా పోలీసు అధికారులకు నేరుగా అందజేయవచ్చును అని, అలాగే https://meekosam.ap.gov.in వెబ్‌ సైట్ ద్వారా ఆన్‌ లైన్ ఫిర్యాదులు చేసుకునే అవకాశం ఉంది.ఫిర్యాదు స్థితి తెలుసుకోవాలంటే 1100 టోల్‌ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు.ఈరోజు మొత్తం 48 ఫిర్యాదులు అందగా, వాటిలో ఎక్కువగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, మోసపూరిత లావాదేవీలు ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదుదారుల తో నేరుగా ముఖాముఖి మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ నందు మాదే పిల్ల గ్రామం నుండి ఒక మహిళ రమ్యశ్రీ అనే ఆమె యొక్క కుమార్తె లక్ష్మీప్రియ భర్త కాపురం విషయంలో మనస్ప్రొద్ధుల కారణంగా విడివిడిగా ఉండడాన్ని జిల్లా ఎస్పీ కి కలిసి ఫిర్యాదు చేసిన దానిపై మహిళా పోలీస్ స్టేషన్ లో భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ను నిర్వహించి కాపురం నిలబెట్టిన విషయంలో ఆమె యొక్క కూతురు కాపురం నిలబెట్టిన విషయంలో జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక చొరవ తీసుకొనడం వలన ఆమె కాపురం నిలబడిందని జిల్లా ఎస్పీకి రమ్యశ్రీ  కలిసి కృతజ్ఞతలను తెలియ చేసినది,ఈ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదిదారులు కోసం ఏలూరు శ్రీ సత్యసాయి సంఘం తరఫున భోజన ఏర్పాట్లు చేసినారు.

About Author