ఇ బి సి కాలనీ లో రోడ్ల సమస్యను పరిష్కరించాలని ఎస్ డి పి ఐ డిమాండ్
1 min read

హొళగుంద న్యూస్ నేడు : కర్నూల్ జిల్లా ఆలూరు తాలూకాహొళగుంద మండల ఈ బీ సీ కాలని నందు సిసి రోడ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎస్ డి పి ఐ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా బ్రాంచ్ అధ్యక్షులు మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ కు అలాగే గ్రామ సర్పంచ్ తనయుడు పంపాపతికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎస్ డి పి ఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా బ్రాంచ్ అధ్యక్షులు కె, ఆరిఫ్, మాట్లాడుతూ ఈ బీసీ కాలనీలో మొత్తం ఆరు లైన్లు ఉన్నాయి అందులో దాదాపు 5 లైన్లు సిసి రోడ్డు వేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మూడో వ షోరూం లైన్ ను 15 సంవత్సరాలు కిందట పంచాయితీ ద్వారా సగానికి రోడ్డు వేయడం జరిగింది మిగతా సగం అలాగే వదిలేశారు మిగతా సగం వేసిన సిసి రోడ్డు అది కూడా వర్షాకాలం కారణంగా గుంతల పడి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది ఎస్ డి పి ఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తల మరియు కాలనీవాసుల డిమాండ్ ఏమనగా ఈ రోడ్డు సమస్య పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ మరియు గ్రామ సర్పంచ్ స్పందించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. వినతి పత్రం ఇచ్చినా అనంతరం హొళగుంద గ్రామ పంచాయతీ కార్యదర్శి గా మరల బాధ్యతలు చేపట్టినందున రాజశేఖర్ గౌడ్ కు ఎస్ డి పి ఐ కార్యకర్తలు కాలనీవాసులు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ గ్రామ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ కార్యదర్శి రాజశేఖర్ గౌడకు సర్పంచ్ తనయుడు పంపకు శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ డి పి ఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా బ్రాంచ్ అధ్యక్షులు కె, ఆరిఫ్, ఎం, చికెన్ బక్షి, ఎం, రహమతుల్లా, హెచ్, భాష, బి, సబూర్, జి ,ని సార్, కాలనీవాసులు కలాం, ఎం, హబీబ్, తదితరులు పాల్గొన్నారు.


