NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్రైనేజీ పనులు నాణ్యతగా ఉండాలి..

1 min read

రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి..

బనగానపల్లె న్యూస్​ నేడు : డ్రైనేజీ పనులు నాణ్యతగా చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.మంగళవారం నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని జుర్రేరు వాగు సమీపంలో డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పరిశీలించారు.పట్టణంలో జుర్రేరు వాగు సమీపంలో బంగారమ్మ తోట దగ్గర జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలన తర్వాత అధికారులకు పలు సూచనలు తెలియజేశారు.బంగారమ్మ తోట దగ్గర డ్రైనేజీ అభివృద్ధి పనులను అధికారులుతో కలిసి పర్యవేక్షించి,పలు సూచనలు,సలహాలు చేశారు.డ్రైనేజీ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.ఈ సందర్భంగా బంగారమ్మ తోట వద్ద 2 వీధుల్లో మౌలిక సదుపాయాలు లేవంటూ మంత్రి దృష్టికి స్థానిక కాలనీవాసులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.ఆయా సమస్యలను విని,వాటి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని,కాలనీ వాసులకు మంత్రి హామీ ఇచ్చారు.ఆయా కాలనీల్లో తక్షణమే విద్యుత్,త్రాగు నీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

About Author