భూహక్కు స్వామిత్వ రీసర్వేపై అవగాహన కార్యక్రమం
1 min read

చెన్నూరు, న్యూస్ నేడు : భూహక్కు చట్టం స్వామిత్వ కార్యక్రమం ద్వారా గ్రామాలలో శాటిలైట్ రోవర్ ద్వారా మ్యాపును గుర్తించి ఆయా గ్రామాలలోని ఇంటిహక్కుదారునికి సంబంధించిన కొలతలను గ్రామ పంచాయతీ ద్వారా రీ సర్వే చేయించి హద్దులను నిర్ణయించడం జరుగుతుందని ఉప ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు తెలిపారు. ఈ విషయమై కార్యదర్శులు, సర్వేయర్లకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డేటా ఆపరేటర్లకు బుధవారం స్థానిక ఎంపీడీవో సభా భవనం నందు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రతి గ్రామంలో చేపట్టే రీసర్వే, స్వామిత్వ కార్యక్రమం లో నిర్వహించే విధి విధానాలు వాడవలసిన సాంకేతిక యంత్రములు, డేటా వివరాల గురించి వాటిపై తీసుకోవలసిన తగు జాగ్రత్తలపై శిక్షణ తరగతులకు వచ్చిన వారికి అవగాహన తో పాటు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.ఈ శిక్షణ తరగతులకు టి ఓ టి గా పవన్ కుమార్ రెడ్డి శివాలపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు స్వామిత్వా గురించి వివరించడం జరిగింది. గ్రామాలలో చేపట్టే ఈ సర్వే శాటిలైట్ రోవర్ ద్వారా మ్యాపింగ్ చేయడం జరుగుతుందన్నారు. అలాగే గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి వారింటికి సంబంధించిన కొలతలు నిర్వహించి హద్దులు వేయడంతో పాటు ఇంటి యజమానికి ప్రాపర్టీ కార్డును అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ,ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు డిజిటల్ అసిస్టెంట్ లు,సర్వేయర్ లు పాల్గొన్నారు.


