నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం…
1 min read

ది.శనివారపు పేట విశాల సహకార పరపతి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
నూతన చైర్మన్ గా కోనేరు వంశీకృష్ణ , మరియు పర్సన్స్ గా సభ్యులు ఎన్నిక
పెద్ద ఎత్తున పాల్గొన్న వివిధ డివిజన్ల ఇన్చార్జిలు కూటమి నాయకులు
వ్యవసాయ ఆధారిత రైతు కుటుంబాలకు సహకార సంస్థలు నిరంతరం పని చేస్తాయి
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : స్థానిక శనివారపు పేట నందు గల ది.శనివారపు పేట విశాల సహకార పరపతి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ది.శనివారపు పేట విశాల సహకార పరపతి సంఘం నూతన చైర్మన్ గా కోనేరు వంశీకృష్ణ మరియు పర్సన్స్ గా సోమిశెట్టి రామ్మోహన రావు మరియు కొనికి మహేష్, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం ఏర్పడినటువంటి ది.శనివారపు పేట విశాల సహకార పరపతి సంఘం చైర్మన్ గా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి కోనేరు వంశీకృష్ణను నియమించడ పై ఆయన హర్షం వ్యక్తం చేశారు, మొట్టమొదటిసారి చోదిమెళ్ళ గ్రామానికి ఈ పదవి దక్కిందని, రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి చైర్మన్ గా రావడం వల్ల రైతుల మరియు వ్యవసాయ ఆధారిత రంగాల వ్యక్తులకు సంబంధించిన రుణాలు మంజూరు కు సహకార సంస్థలు నిరంతరం పనిచేస్తయని మరియు డిపాజిట్లు సేకరణ సులువు అవుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు,ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, కో-ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్ పెదబాబు, మరియు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జీలు,డివిజన్ల ఇన్చార్జిలు,వివిధ హోదాలలో ఉన్న ఉమ్మడి కూటమి నాయకులు,అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం సహకార సంఘం సొసైటీ యొక్క ప్రగతి సంఘ సీఈవో ఆర్.వి శ్రీనివాసరావు వివరించారు.


