79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి
1 min read

పొలీస్ పెరేడ్ గ్రౌండ్స్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలి
సమన్వయ అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించిన జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లాలో ఈ నెల 15వ తేదీన 79వ భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఆమె సమీక్షించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జాతీయ స్పూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వేడుకలు నిర్వహించే పొలీస్ పెరేడ్ గ్రౌండ్స్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వేడుకల నిర్వహణకు వేదికను తగిన విధంగా అలంకరించి సిద్ధం చేయాలన్నారు. సీటింగ్ ఏర్పాట్లు, విఐపిలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని , శానిటేషన్, త్రాగునీటి సరఫరా, తదితర ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. దేశభక్తి పెంపొందించేలా విద్యార్ధులచే సాంస్కృతిక ప్రదర్శనలు వినూత్న తరహాలో అందరిని ఆకర్షించేలా నిర్వహించాలన్నారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొనే విద్యార్ధినీ, విద్యార్ధులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయటడంతోపాటు వారికి స్నాక్స్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమీషనరుకు సూచించారు. అతిధులకు స్నాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. త్రాగునీటి సౌకర్యాన్ని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిభింబం చేసే విధంగా స్టాల్స్ ఏర్పాటు, ఆయా శాఖల శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా ఉండాలన్నారు. ఆహ్వాన పత్రికలను ప్రొటోకాల్ ప్రకారం గౌ. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, శాసన సభ్యులు, తదితర ప్రజా ప్రతినిధులకు అందజేయాలన్నారు. జిల్లా యంత్రాంగంలోని ప్రభుత్వ శాఖల్లో ఉత్తమంగా పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి వారి పేర్లను ప్రతిపాధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాలని ఆర్.టి.సి. పిఆర్ఓ నర్సింహరావుని ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, సిపివో వాసుదేవరావు, ఎఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, పశుసంవర్ధకశాఖ జెడి గోవిందరాజులు, డిఇఓ ఎం. వెంకటలక్ష్మమ్మ, ఎస్సీ కార్పోరేషన్ ఈడి ఎం. ముక్కంటి,డిపివో కె. అనురాధ,హౌసింగ్ పిడి సత్యనారాయణ,ఎపిఇపిడిసిఎల్ ఎస్ఈ పి. సాల్మన్ రాజు, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ పి. నాగార్జునరావు, బి.సి. కార్పోరేషన్ ఈడి ఎన్. పుష్పలత, జిల్లా బి.సి. సంక్షేమ అధికారి ఆర్.వి. నాగరాణి, జిల్లా మైనారీటీ సంక్షేమ అధికారి ఎన్.ఎస్. కృపావరం, తహశీల్దారు గాయిత్రి, డ్వామా పిడి కె.వి. సుబ్బారావు, ఐసిడిఎస్ పిడి పి.శారద, స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎన్. జితేంధ్ర, మున్సిపల్ కమీషనరు భానుప్రతాప్, డిఎస్ఓ విలియమ్స్,ఎన్.టి.ఆర్. ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ డా. రాజీవ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


