నకిలీ ఫెస్టిసైడ్స్ వాహనం పట్టుకున్న చింతలపూడి ఏడి
1 min read

స్టాక్ ని,వాహనాన్ని సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :లింగపాలెం మండలం,యడవల్లి గ్రామంలో గురువారం రైతులకు ఇచ్చే నకిలీ మందులు చింతలపూడి అగ్రికల్చర్ ఏడి సుబ్బారావు పట్టుకున్నారు. అనాథరైజ్డ్ ఫెర్టిలైజర్స్ వెళుతున్న వాహనo చింతలపూడి నియోజకవర్గం ఎడవల్లి గ్రామంలో పట్టుకున్నారు. మైలవరం నుండి వస్తున్నట్లు వాహన డ్రైవర్ తెలిపినట్లు చెప్పారు. ఈ ఫెర్టిలైజర్స్ కి ఏ విధమైన బిల్స్ కానీ, ఇన్వాయిస్ కానీ లేవని తెలిపారు.స్టాక్ ని, వెహికల్ ని సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్వాలిటీ చెకింగ్ నిమిత్తం శాంపిల్స్ తీసి సక్రమంగా ఉన్నది, లేనిదని పై చర్యలు తీసుకుంటామని, స్టాండర్డ్స్ ఉన్నవ లేదా ల్యాబ్ కి పంపించి. రైతులకి అందించవచ్చా లేదా అన్నది తదుపరి తెలియజేస్తామని తెలిపారు. ఈ తనికిల్లో లింగపాలెం అగ్రికల్చర్ ఏవో ప్రదీప్ కుమార్,స్థానిక విఆర్ఓ ఉన్నారు.

