అర్హత కలిగి దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవాడికి ఇంటి స్థలాలు ఇవ్వాలి
1 min read

సిపిఐ జిల్లా మహాసభల గోడపత్రికి విడుదల
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో అర్హత కలిగి దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవాడికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)పట్టణ కార్యదర్శ జి.రంగన్న, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, ఎమ్మిగనూరు మండల కార్యదర్శి రాజీవ్ తెలిపారు.అనంతరం సిపిఐ కార్యాలయం జిల్లా మహాసభల గోడపత్రికలను విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోసి స్వాతంత్ర భారత దేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న ఎన్డీఏ ప్రభుత్వం నుండి దేశాన్ని కాపాడుకోవడానికి మరో స్వాతంత్ర చేయాల్సి వస్తుందని దీనికి ప్రజల సిద్ధంగా ఉండాలని వారు తెలిపారు. వందేళ్ళ కిందట దేశంలో బ్రిటీ సామ్రాజ్యం రాజమేలుతున్న సందర్భంలో వారికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ, జాతీయ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలే ఉద్యమం చేసి స్వాతంత్రాన్ని తెచ్చి పెట్టాయని వారు గుర్తు చేశారు. దుర్మార్గానికి వ్యతిరేకంగా ఎంతోమంది మహనీయులు జైలు పాలు అయ్యారని గాంధీ నాయకత్వంలో జరిగిన పోరాటాలకు జాతీయ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలో నాయకత్వం వహించాలని ఇలాంటి భారత దేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కారణంగా ప్రజాస్వామ్యం లౌకిక కులాలు మతాలు సమన్వయంతో ముందుకు వెళ్తుంటే 11 ఏళ్ల కిందట అధికారంలోకి వచ్చిన మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అంచలంచలుగా వ్యవస్థలన్నిటిని నిర్వీరం చేస్తుందని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో అమలు చేయడంలో పూర్తిగా వైపళ్ళం చెందిందని వారు తెలిపారు. కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి పాలక ప్రభుత్వాలు కృషి చేయకుండా జిల్లాను విస్మరిస్తున్నారని ముఖ్యంగా కరువు కాటకాలు రైతాంగ ఆత్మహత్యలు వలసలు నిరంతరంగా పెట్టరేగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే ఆగస్టు 9,10,11 తేదీలలో కర్నూలు లో జరిగే సిపిఐ 24వ జిల్లా మహాసభలను వేదిక చేసుకుని ఈ జిల్లా మహాసభల్లో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధిపై చర్చించి భవిష్యత్ కరాచరణ రూపొందించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ మహాసభలకు ప్రజానీకం పెద్ద ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బజారి, దాదావలి,కెసి జబ్బర్, తిమ్మ గురుడు,విజయేంద్ర, నరసింహారెడ్డి,కాజా, మల్లికార్జున గౌడ్, నరసింహులు, ఇస్మాయిల్, నాగేంద్ర,రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

